News

వరలక్ష్మి వ్రతంలో రేవంత్‌రెడ్డి


టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అత్తావారింట్లో కుమార్తె నైమిషారెడ్డి చేస్తున్న వరలక్ష్మి వ్రతాన్ని చూసేందుకు కుటుంబసభ్యులతో సహా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లారు. సంప్రదాయబద్ధంగా కుమార్తె చేస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి ఆసక్తిగా చూశారు. అటు భీమవరం వచ్చిన రేవంత్‌రెడ్డిని స్థానిక టీడీపీ నాయకులు కలిసి కాసేపు రాజకీయాల గురించి చర్చించుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి నయీమ్ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్‌తో కలిసి అధికారం అనుభవించిన కేసీఆర్, హరీష్‌రావు, నాయిని నర్సింహారెడ్డిలు నయీమ్‌ను పెంచిపోషించారా అని ప్రశ్నించారు.