జాట్ రిజర్వేషన్లు కొట్టివేత
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో జాట్ కులస్థులకు రిజర్వేషన్ కల్పిస్తూ గత యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తి తరుణ్ గొగొయ్, న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. జాట్ కులస్థులను ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలోకి(ఓబీసీ) చేరుస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను తోసిపుచ్చుతున్నామని ధర్మాసనం పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా జాట్‌లను వెనుకబడిన కులస్థులుగా పరిగణించలేము కాబట్టి వారిని కేంద్రానికి సంబంధించిన ఓబీసీల జాబితాలో చేర్చలేమంటూ వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్(ఎన్‌సీబీసీ) చేసిన నిర్థారణలను సైతం తోసిరాజని యూపీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘‘కులమన్నది ఒక ప్రధాన అంశమే అయినప్పటికీ, సమాజంలో ఒక వర్గానికి సంబంధించిన వెనుకబాటుదనాన్ని నిర్థారించేందుకు అదే ఏకైక అంశం కాజాలదు’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఓబీసీ రిజర్వేషన్లపై మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా ఉదాహరిస్తూ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘గతంలో ఒక సామాజిక వర్గాన్ని ఓబీసీల జాబితాలో చేర్చి తప్పు చేసి ఉంటే.... భవిష్యత్తులో మరో తప్పునకు అది ప్రాతిపదిక కారాదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








