News

ఏఐఎస్‌ అధికారుల విభజన పూర్తి


ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ, రాష్ట్రాల నడుమ అఖిలభారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ గురువారం భారతప్రభుత్వ రాజపత్రంలో నోటిఫికేషన్‌ను ప్రచురించింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం ఐఏయస్ అధికారులు ఏపీకి 161 మంది, తెలంగాణకు 133 మంది, ఐపియస్ అధికారులు  ఏపీకి 116, తెలంగాణకు 95 మంది, ఐఎఫ్‌యస్  ఏపీకి 69, తెలంగాణకు 58 మందిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరుకున్న జేఎస్వీప్రసాద్‌, రజత్‌ భార్గవ, సిద్ధార్థ జైన్‌ను కూడా ఏపీకే కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నప్పటికీ సోమే్‌షకుమార్‌, పూనం మాలకొండయ్యను ఏపీకి కేటాయించారు. తెలంగాణలోనే ఉండాలనుకున్న.. వాణీప్రసాద్‌, ఆమ్రపాలితోపాటు వరంగల్‌ కలెక్టర్‌ వి.కరుణ, నిజామాబాద్‌ కలెక్టర్‌ రోనాల్‌రాస్‌ సైతం ఏపీకి వెళ్లారు. తెలంగాణలో చదువుకున్న వారిని కూడా ఆంద్రప్రదెశ్‌కు  కేటాయించారు.