‘కేంద్ర పథకాల అమలులో తెలంగాణ ముందు వరుసలో వుంటుంది
న్యూఢిల్లీ: దేశంలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ఇవాళ్టి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారని, తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశ పెడుతుందని తాము అనుకుంటున్నామని వినోద్ వెల్లడించారు. నీతి ఆయోగ్, ప్రధానితో జరిగిన సమావేశాల్లో నూతన పారిశ్రామిక విధానంపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయాలు పంచుకున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రధాని అరుణ్‌జైట్లీతోపాటు పలువురు మంత్రులకు వివరించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన విధానాన్ని కేంద్రం అవలంభించాలను కోవడం సంతోషకరమైన విషయమన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందని వెల్లడించారు. స్వచ్చ్ భారత్ అంటే రోడ్లు ఊడ్చడమే కాకుండా ప్రతీ ఇల్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడమేనని కేంద్రం ఆలోచించడం బాగుందని పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








