News

 రాష్ట్రపతి,ప్రధాని,కలాం శుభాకాంక్షలు టీమిండియాకు.

న్యూఢిల్లీ:  ఐసిసి వరల్డ్‌కప్‌లో భారత్‌ శుభారంభం చేసిన  అఖండ విజయాన్ని అందించిన భారత జట్టుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, మాజీ రాష్ట్రపతి కలాం శుభాకాంక్షలు తెలియజేశారు. అడిలైడ్ వన్డేలో భారత్ 76 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని సాధించిన నేపథ్యంలో నేతలు టీంను అభినందనలతో ముంచెత్తారు. ప్రపంచ కప్‌లో భారత్, పాక్ పై వరుసగా ఆరుసార్లు గెలవడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా సంబరాలు జరుపుకుంటున్నారు.


301 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 224 పరుగులతోనే సరిపెట్టుకొని వెనుదిరిగింది. 104 పరుగులతో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.