News

మహేష్ ఊరిని దత్తత


రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఒక్కో ఊరిని దత్తత తీసుకుని అభివృద్ది చేయాలన్న ప్రధాని నరేంద్రమోడి పిలుపుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఆయన సొంత గ్రామం అయిన గుంటూరు జిల్లా బుర్రిపాలెంను మహేష్ దత్తత తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతారని మహేష్ కుటుంబ సభ్యుడు, ఎంపీ జయదేవ్ వెల్లడించాడు. జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్బంగా ఈ విషయం వెల్లడించారు. రెమ్యునరేషన్ లో ముప్పైశాతం సహాయ కార్యక్రమాలు, దానాలకు ఉపయోగిస్తాడని కొద్దిరోజుల క్రితమే సన్నిహితులు చెప్పారు.