News

సినీ నటుడు దేవదాస్ స్థలం కబ్జా!


సినీ నటుడు దేవదాస్ కనకాలకు చెందిన భూమి కబ్జాకు గురైంది. ప్రముఖ యాంకర్ సుమ కు మామగారయ్యే దేవదాస్, ఆయన కుమారుడు, నటుడు రాజీవ్ లు ఈ విషయంపై హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని దేవదాస్ స్థలంలో కొందరు దుండగులు ప్రవేశించి,నిర్మాణాలు కూడా చేపట్టారు.ఈ సమాచారం అందుకున్న దేవదాస్ ,రాజీవ్ లు అక్కడకు వెళ్లి,స్థలం ఖాళీ చేయాలని కోరినా వారు వినలేదు.దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.