News
ఎంఎస్ నారాయణ ఇకలేరు
ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. ఆనారోగ్యంతో మాదాపూర్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎమ్మెస్ నారాయణ కుమారుడు విక్రమ్ ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా ఎమ్మెస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు సినీ అభిమానులకు ఎమ్మెస్ నారాయణగా సుపరిచితుడైన మైలవరపు సూర్యనారాయణ ఏప్రిల్ 16, 1951లో పశ్చిమగోదావరి జిల్లాలోని నిడమర్రులో జన్మించారు. ఆయనకు భార్య కళాప్రపూర్ణ, కుమారుడు విక్రమ్, కుమార్తె శశికిరణ్ ఉన్నారు. సుమారు 700 సినిమాల్లో నటించిన ఎమ్మెస్ ప్రతిష్టాత్మక నంది అవార్డును అయిదుసార్లు అందుకున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








