News

 కేసీఅర్ 18న పాలమూరుజిల్లాలో


సీఎం కేసీఅర్ ఈ నెల 18న పాలమూరుజిల్లాలో పర్యటించనున్నారు. 


పట్టణంలోని మురికివాడల్లో ఆయన పర్యటించి ప్రజలను స్వయంగా కలిసి సమస్యలు తెలుసుకొనే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.ముఖ్యమంత్రే నేరుగా ప్రజల్లోకి వెల్లడం ద్వారా ప్రజల్లో భరోసా, నమ్మకాన్ని కల్గించవచ్చని, అన్నింటికీ మించి ప్రజల్లో ప్రభుత్వంపట్ల మరింత నమ్మకం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వరంగల్ పర్యటనలో ఇది నిరూపితమయ్యిందని గుర్తుచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సీఎం పర్యటనలు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయని చెప్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్‌లో సీఎం పర్యటనపై అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.