News

ఛత్తీస్‌గఢ్‌లో మేయర్‌గా విజయం సాధించిన హిజ్రా


ఛత్తీస్‌గఢ్‌లో మధు కిన్నర్‌ అనే ఓ హిజ్రా చరిత్ర సృష్టించింది. రాయ్‌గఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. బిజెపి, కాంగ్రెస్‌ల కన్నా 9, 500 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించడంతో మధు కిన్నర్‌ మద్దతుదారులు పండగ చేసుకున్నారు. ఈ స్థానంపై కన్నేసిన బిజెపికి మధు చుక్కలు చూపించింది. తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యంలో కనబరచింది. తన విజయంతో అధికార బిజెపికి గట్టి సవాలు విసిరింది.