News

ఇక పాఠశాలల్లో సెల్‌ఫోన్లు నిషేధం


-ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకూ వర్తింపు
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మహిళలు, బాలికల రక్షణ, భద్రత కోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సెల్‌ఫోన్లను నిషేధిస్తున్నామని జిల్లా విద్యా శాఖాధికారి అణభేరి రాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో వార్డెన్లు, అటెండర్లు, వాచ్‌మెన్లను నియమించేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్‌ను తప్పకుండా చేయించాలన్నారు. సంబంధిత విషయంపై పాఠశాల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డీఈవో తెలిపారు.