టిఆర్ఎస్ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చింది
టిఆర్ఎస్ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిందని, అస్సాంలో గణపరిషత్ పార్టీకి పట్టిన గతే ఆ పార్టీకి పడుతుందని, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వారికి అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సిఎల్పీ నాయకులు జానారెడ్డి అన్నారు. మంగళవారం కొత్త పేటలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ సముద్రం లాంటిదని దీన్ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కెసిఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే కొనసాగిస్తుందని, కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. స్వార్థ పరులు పార్టీని వీడి వెళుతున్నారని వెళ్లే ముందు నిందలు వేయడం సబబు కాదని నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బాలూ నాయక్ టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు అసంతృప్తికి గురికావద్దని సూచించారు. టిఆర్ఎస్ ముందు కండువాలు కప్పుతుందని తర్వాత దుప్పట్లు కప్పి బొంద పెడుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నల్గొండ జిల్లా ప్రాత్రకీలకమని అన్నారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని అన్నారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. కెసిఆర్ ఆర్నెళ్ల పాలనలో చేసిందేఏమీ లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించాడు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎస్టీ సెల్ ఛైర్మన్ జగన్ లాల్ నాయక్, దేవరకొండ జెడ్ పిటిసి అల్లంపల్లి నరసింహా, తీగల గోవర్థన్ రెడ్డి, కందుల ప్రభాకర్, జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








