News

సాంస్కృ‌తి సాంప్రదాయాలకు...


గ‌చ్చి‌బౌలి : సాంస్కృ‌తి సాంప్ర‌దాయాల‌కు మ‌న దేశం నిలయమ‌ని కేంద్ర మంత్రి బండారు ద‌త్తా‌త్రేయ అన్నా‌రు. గ‌చ్చి‌బౌలిలోని జి‌ఎంసి బాల‌యోగి స్టే‌డియంలో సిలికానాంధ్ర ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల‌ పాటు జరిగే నాలుగో అంత‌ర్జా‌తీయ కూచిపూడి నాట్య స‌మ్మే‌ళ‌నానికి ముఖ్యతిథిలుగా కేంద్ర‌మంత్రి ద‌త్తా‌త్రేయ‌, నిజామాబాద్ ‌ఎంపి క‌విత‌ హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లా‌డుతూ... ఆధ్యా‌త్మి‌క భావ‌న గ‌ల‌ కూచిపూడి నాట్యా‌నికి భార‌త‌దేశం కేంద్ర బిందువులాంటిద‌ని అన్నా‌రు. కూచిపూడి నాట్యం ఏకాగ్ర‌త‌తో చేసేద‌ని అన్నా‌రు. కూచిపూడి మెరుగుప‌డ్డా‌క కూచిపూడి అనే గ్రామానికి ‌ఎంతో పేరు ప్ర‌ఖ్యా‌త‌లు వ‌చ్చా‌య‌ని అన్నా‌రు. అలాగే ఆ గ్రామం ‌ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంద‌ని ఆయన అన్నా‌రు. అనంత‌రం ‌ఎంపి క‌విత మాట్లా‌డుతూ.. కుల‌మ‌త ప్రాంతాల‌కతీతంగా క‌ళ‌ల‌ను గుర్తించి ప్రోత్స‌హించాల‌ని అన్నా‌రు. కూచిపూడి క‌ళారంగాన్ని ప్రోత్స‌హించేందుకు ఆ క‌ళాకారుల‌కు అగ్ర‌హారాన్ని అందించిన ఘ‌న‌త నిజాందేన‌ని అన్నా‌రు. క‌ళ‌ల‌కు ‌త‌మ ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంటుంద‌ని ఆమె న్నా‌రు. మ‌న సంస్కృ‌తిని దేశ‌, విదేశాల్లో చాటి చెప్పిన ఘనత కూచిపూడి నాట్య‌మేన‌ని అన్నా‌రు. క‌ళ‌ల‌కు ప్రాంతీయ బేధాలు ఉండ‌వ‌ని అన్నా‌రు. తెలంగాణ రాష్ర్టంలో కూడా ప్ర‌తి ప్రాంతంలో కూచిపూడి క‌ళాకారులు ఇత‌ర క‌ళాకారులు ఉన్నా‌ర‌ని ఆమె న్నా‌రు. ఈకార్య‌క్ర‌మంలో కూచిపూడి నాట్య క‌ళాకారులు, నిర్వా‌హ‌కులు పాల్గొ‌న్నా‌రు.