వరంగల్‌లో మేజరీటి తగ్గోద్దు కేటిఆర్
తెలంగాణ పది జిల్లాల ప్రజలేకాక తెలుగు ప్రజలంతా వరంగల్ వైపు చూస్తున్నారని తెలంగాణ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పోరుగడ్డ అని, ముఖ్యమంత్రులు కిరణ్‌కుమార్ రెడ్డికి గాని,చంద్రబాబు నాయుడుకు గాని చుక్కలుచూపిన జిల్లా అని, ఇక్కడ టిఆర్ఎస్ గెలుపు పై ఎలాంటి అనుమానం లేదని ఆయన అన్నారు. మనసున్న నాయకుడు, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు కెసిఆర్ అని, ఆయన చేపట్టిన అనేక పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. అయితే ఎలాగూ గెలుస్తాం కదా అని ఎవరికి వారు ఇంటిలో కూర్చుంటే ప్రమాదం అని కెటిఆర్ హెచ్చరించారు. దీనివల్ల మెజార్టీ తగ్గినా, విపక్షాలు వ్యాఖ్యానాలు చేస్తాయని, కొన్ని మీడియా వర్గాలు సన్నాయి మాటలు మాట్లాడతాయని కెటిఆర్ అన్నారు. అంతా వచ్చి ఓటు వేసి మెజార్టీ తగ్గకుండా టిఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








