News

వరంగల్‌ ఎన్నికలో ఆ పార్టీకి ఓటు వేయరు


బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో వెల్గటూరు మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటించారు. వాటర్‌గ్రిడ్‌ పథకంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అఖిలపక్ష సమావేశం పెడితే నిరూపిస్తామని సవాల్ విసిరారు. కరువు మండలాలను ఎందుకు ప్రకటించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ప్రజలు ఓటు వేయరని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. వరంగల్ ఎన్నికలు ఎందుకు వచ్చాయో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు.