హెల్మెట్ ధరించకుంటే చట్టరీత్యా చర్యలు
రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు రహదారి ప్రమాదాల నివారణకు నవంబర్ ఒకటి నుంచి హెల్మెట్ తప్పనిసరి అని తెలిపారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హెల్మెట్ ధారణపై రవాణాశాఖ రూపొందించిన ఫ్లెక్సీలను కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధారణపై అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ ధరించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఉపరవాణా కమిషనర్ రాజ రత్నం మాట్లాడుతూ రవాణాశాఖతో పాటు రహదారులు, భవనాలశాఖ సహకారంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మెటార్ వాహనాల తనిఖీ అధికారి ఉమామహేశ్వరావు, ఆర్ అండ్‌బీ ఎస్‌ఈ కేవీ రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








