News

వైఎస్‌ లూటీ చేసిన డబ్బును అప్పగిస్తే అభివృద్ధి


తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని   అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు గుర్తించిన పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. వైఎస్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వైఎస్‌ హయాంలో జగన్‌ తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని అన్నారు. వైఎస్‌ లూటీ చేసిన డబ్బును ప్రజలకు అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.