చంద్రబోస్‌కు సంబంధించిన విషయాలు ప్రజల్లోకి
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన పలు కీలక విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు నిర్ణయించింది. ఆయన దేశ సంపద వంటి వారని ఆయన చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసుకోవాలని అనుకునే వారి కోసం ఆ అవకాశం కల్పిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి నేతాజీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ పోలీస్ ఆర్కైవ్స్ లో అందుబాటులో ఉంటాయిని సీఎం వెల్లడించారు. ఆయన ఎక్కడ పుట్టారో, ఎప్పుడు పుట్టారో అందరికీ తెలుసని. ఐతే ఎలా చనిపోయారనే విషయం ఇంకా చాలా మందికి తెలియదని. తెలుసుకునే హక్కు ప్రజలకుందని ఆమె అన్నారు. 1937 నుంచి 1947 వరకూ నేతాజీ సంబంధించిన విషయాలన్నింటినీ డిజిటైజేషన్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా ఆమె తెలిపారు. ఈ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలని అనుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








